పరిస్థితులు (Circumstances)
ఒక చర్య చుట్టూ ఉండి, దాని అర్థం ఏమిటో నిర్ధారించే వాస్తవాలు. షరతులు అంటే పక్షాలు చెప్పినవి; పరిస్థితులు అంటే ఇద్దరికీ అప్పటికే తెలిసినవి. పరిస్థితులు ఒక బేరానికి దేనినీ జోడించవు, దాని నుండి దేనినీ తీసివేయవు — పక్షాలు వాడిన మాటలకూ నడవడికకూ అర్థాన్ని స్థిరపరచడం మాత్రమే అవి చేస్తాయి. ఏ మాటా, ఏ నడవడికా మోయని సమ్మతిని అవి ఎన్నడూ సమకూర్చవు. ఒక పరిస్థితి నిజంగా ఉండిందా లేదా అనేది సాక్ష్యానికి సంబంధించిన ప్రశ్న, దానిపై ఆధారపడిన తీర్పు మిగతా ఏ తీర్పులాగే ఖండించదగినదిగానే ఉంటుంది.